విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం

విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం
  • 1,191 మంది విద్యార్థులకు పట్టాలు 

హైదరాబాద్, వెలుగు:ఏపీ గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ వర్సిటీలో ఆదివారం స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆన్‌‌లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్‌‌ లెర్నింగ్‌‌లో ఎంసీఏ, ఎంబీఏతో పాటు పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన 1,191 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆర్‌‌‌‌ఆర్ స్పోర్ట్స్‌‌ ఫౌండర్ గల్లా రాధారాణికి గౌరవ డాక్టరేట్ అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఎం రాయ్‌‌పూర్ మాజీ డైరెక్టర్ రామ్‌‌ కుమార్ కాకాని మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యంపైనే దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ ప్రొఫెసర్ నాగభూషణ్‌‌, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.